బిగ్ బాస్ సీజన్-8 లో గౌతమ్ ఎలిమినేషన్ దాకా వెళ్లి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రతీ టాస్క్ ఫుల్ కసిగా ఆడుతూ వంద శాతం ఎఫర్ట్స్ తో టాప్-5 లో చోటు దక్కించుకున్నాడు. అయితే బయట ఎలా ఉందంటే.. గౌతమ్‌ని బిగ్ బాస్ టీమ్ తొక్కేస్తుంది.. నిఖిల్‌ని విన్నర్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఇలా చేశారేమో అని అనుకుంటున్నారు. కానీ గౌతమ్ జర్నీ వీడియో చూసాక అది మార్చుకుంటారు. గౌతమ్ జర్నీ వీడియో అదిరిపోయింది. ఇది అందరికంటే ముందు చూపించడం కూడా ఓటింగ్ పరంగా అతనికి చాలా ప్లస్. ఎందుకంటే కీలకమైన చివరి వారంలో ఈ జర్నీ వీడియో కూడా ఓటింగ్‌ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.
బిగ్ బాస్ ఆట మరో కీలకమైన దశకు చేరుకుంది. ఫినాలే వీక్‌లో ఫైనలిస్ట్‌ల జర్నీ వీడియోలు వాళ్ల ఓటింగ్‌పై చాలా ప్రభావితం చూపిస్తాయి. వాళ్ల జర్నీని ఎంత బాగా చూపిస్తే అన్ని ఓట్లు. ఎవరి జర్నీని ఎలా చూపించారు? ఎంతసేపు చూపించారు? ఎప్పుడు చూపించారు? ఇవన్నీ కూడా చాలా కీలకమే. అయితే ఇక విజేతను తేల్చేందుకు మూడు రోజుల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ జర్నీ వీడియోల టైమింగ్ కూడా చాలా కీలకం. అయితే ఫైనలిస్ట్‌లలో తొలి జర్నీ వీడియో గౌతమ్‌కి పడింది. లైవ్ ఎపిసోడ్‌లో గౌతమ్ జర్నీ వీడియో చాలా ఎమోషనల్‌గా చూపించారు.
తన బిగ్ బాస్ జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్. తన తల్లి గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. లైవ్ ఎపిసోడ్‌లో దాదాపు 10 నిమిషాల పాటు.. తన లైఫ్ జర్నీ గురించి చెప్పాడు గౌతమ్. తను బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది రెస్పెక్ట్ కోసం అని.. తన లైఫ్‌లో ఇప్పటివరకూ రెస్పెక్ట్ దొరకలేదని.. రెస్పెక్ట్ కోసం ఎంత దూరం అయినా వెళ్తానని అన్నాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 7 తన లైఫ్‌కి ఎంతో మేలు చేస్తే.. బిగ్ బాస్ సీజన్ 8 తన లైఫ్‌కి మైల్డ్ స్టోన్ అని అన్నాడు. బిగ్ బాస్ జీవితాంతం రుణపడి ఉంటానంటూ గౌతమ్ సాష్టాంగ నమస్కారం చేశాడు.